Alanati ramachandradu -Lyrics from Murari
Alanati ramachandradu Lyrics - Jikki, Sunitha, Sandhya
Singer | Jikki, Sunitha, Sandhya |
Composer | |
Music | Mani sharma |
Song Writer | Sri venela sitaram sastry |
Lyrics
అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి
అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగాలేవని వెలవెల బోవమ్మా
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతు పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కలకల జంటని పదిమంది చూడండి
తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయ్యండి
చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగాలేవని వెలవెల బోవమ్మా
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపాన
గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి
చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగాలేవని వెలవెల బోవమ్మా
Comments
Post a Comment