Baguntundhi nuvu navvite -Lyrics from Aatidi devo bavaaa movie

Baguntundhi nuvu navvite Lyrics - Sid Sriram,Nutuna Mohan


Baguntundhi nuvu navvite
Singer Sid Sriram,Nutuna Mohan
Composer
Music Sekhar Chandra
Song WriterBhaskara Bhalata

Lyrics

బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే



బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే



బాగుంటుంది నిన్ను తాకితే బాగుంటుంది నువ్వు ఆపితే





బాగుంటుంది కంటికున్న కాటుకంతా ఒంటికంటితే



అహహా బాగుంది వరస నీ మీద కోపం ఎంతుందో తెలుసా



లాలిస్తే తగ్గిపోతుంది బహుశా





ఈ మనసు ప్రేమ బానిస అయితే బుజ్జగించుకుంటాలే



నిన్నే నెత్తినెట్టుకుంటానే నువ్వే చెప్పినట్టు వింటానే



చెలి చెలి జాలి చూపవే తడి చేసేద్దాం పెదవులని





ముడి వేసేద్దాం మనసులని దాచేసుకుందాం మాటలని



దోచేసుకుందాం హాయిని కాదంటానేంటి చూస్తూనే చొరవ



వద్దన్నకొద్దీ చేస్తావు గొడవ





నీ నుంచినేను తప్పుకోడం సులువా కౌగిళ్ళలోకి లాగవా



అమ్మో నువ్వు గడుసు కదా అన్నీ నీకు తెలుసు కదా



అయినా బయట పాడవు కదా పద పద ఎంత సేపుగా





వెలివేసేద్దాం వెలుతురుని పరిపాలిద్దాం చీకటిని



పట్టించుకుందాం చెమటలని చుట్టేసుకుందాం ప్రేమని



నువ్వేమో పెడుతుంటే తొందరలు నాలోని సిగ్గు చిందర వంధరలు





అందంగా సర్దుకోనా ముంగురులు మూసావు అన్ని దారులు



కొంచెం వదిలెనంటే నిన్నిలా మొత్తం జారిపోవా వెన్నెల



వేరే దారి లేక నిన్నిలా బంధించనే అన్ని వైపులా





బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే



బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే




Baguntundhi nuvu navvite Watch Video

Comments

Popular Posts