Kalyanam Vaibhogam -Lyrics from Srinivasa kalyanam movie

<

Kalyanam vaibhogam Lyrics - SP bala subrahmanyam


Kalyanam vaibhogam
Singer SP bala subrahmanyam
Composer
Music Mickey J Meyer
Song WriterShree mani

Lyrics

కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాలకై వేచు సమయాన శివధనువు విరిచాకే వధువు మది గెలిచాకే మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీ రామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది, తనవెంట నడిచింది గెలిచింది రుక్మిణీ ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయములవాడు గోవిందుడమ్మ విరి వలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలొలికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు ఋణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపుకుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటు వధువంటు ఆ బ్రహ్మముడి వేసి జతకలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మదనాన్ని సాగించమంటున్నది జన్మంటు పొంది జన్మివ్వలేని మనుజునకు సార్ధక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం




Kalyanam vaibhogam Watch Video

Comments

Popular Posts